రాజమండ్రిని వారసత్వ నగరంగా గుర్తించండి
NEWS Dec 04,2024 02:25 pm
వెయ్యేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల రాజమండ్రి నగరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించి హృదయ్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చెందేలా చూడాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రి దేశంలోనే ప్రధాన పురాతన నగరాలలో ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పార్లమెంట్లో రూల్ 373 కింద విన్నవించారు.