మీ సేవాలో అవకతవకలపై విచారణ
NEWS Dec 04,2024 05:06 pm
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన మీ సేవా కేంద్రాన్ని సొంత ఇంటిలో నిర్వహిస్తున్నారని, అదే గ్రామానికి చెందిన నాంపల్లి లింబాద్రి 15 రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఆడిషనల్ పీడీ మదన్ మోహాన్ రావు విచారణ చేపట్టారు. మీ సేవా కేంద్రం ఇంటిలో నిర్వహించటంపై పలు పత్రాలను పరిశీలించారు.