అలరించే సినిమాలను ఆదరించండి
NEWS Dec 04,2024 01:09 pm
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వేలాది మంది కష్టంతో కూడుకున్న పని అన్నారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో ..వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా అని పేర్కొన్నారు. అందరిని అలరించే సినిమాలనే ఆదరించాలని పిలుపునిచ్చారు.