పల్నాడు వీరుల చరిత్ర గొప్పది
NEWS Dec 04,2024 10:54 am
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పల్నాడు వీరుల చరిత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాటి వీరుల ఉత్సవాలలో పాల్గొన్నారు. యుద్ద వీరులను పూజించే సంప్రదాయం గ్రీస్ తర్వాత పల్నాడు కారంపూడిలోనే ఉందన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం పల్నాటి యుద్దమే ప్రతీక అని అన్నారు. పల్నాటి వీరుల చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకునేలా చేస్తామన్నారు.