దళారులను నమ్మి మోసపోవద్దు
NEWS Dec 04,2024 10:15 am
దళారులను నమ్మి రైతులు మోస పోవద్దని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ము కోవద్దని సూచించారు . రైతుల ప్రయోజనాల కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.