ఏసిబి కి చిక్కిన మర్కెటింగ్ అధికారి
NEWS Dec 04,2024 10:16 am
నిర్మల్ మార్కెట్ యార్డ్ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిర్మల్ కు చెందిన ఒక వ్యక్తి నుండి కాంటా రెన్యూవల్ నిమిత్తం మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ పదివేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 7000 ఇస్తాననడంతో ఒప్పుకున్నాడు.
కార్యాలయంలో లంచం డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.