Logo
Download our app
రేపు నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్
NEWS   Dec 04,2024 09:27 am
ఈ నెల 5న నిజామాబాద్ కు బీసీ డెడికేటెడ్ కమిషన్ వస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీసీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరిస్తారని తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము (కలెక్టరేట్)లో బీసీ డెడికేటెడ్ కమిషన్ లో పాల్గొంటారు.
⚠️ You are not allowed to copy content or view source