భూకంప తీవ్రతతో విధ్వంసం జరిగితే రిపోర్టు ఇవ్వండి: కలెక్టర్
NEWS Dec 04,2024 09:28 am
ములుగు జిల్లాలో బుధవారం ఉదయం వచ్చిన భూకంపం వల్ల ఏదైనా సమస్య తలెత్తి ధ్వంసం అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని, ఇప్పటివరకు భారీ మొత్తంలో ఎలాంటి ప్రమాదం జరిగినట్లు రిపోర్టు అందలేదని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు సూచించామని కలెక్టర్ వెల్లడించారు.