మరాఠా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
NEWS Dec 04,2024 07:14 am
ఉత్కంఠకు తెర పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కొలువు తీరనున్నారు. ఈ విషయాన్ని మహాయుతి కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.