ఆర్టీసీ డిపో మంజూరుకు ఉత్తర్వులు
NEWS Dec 04,2024 07:37 am
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంకు ఆర్టీసీ డిపోను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాష్ట్రాలకు సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారం కి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం లో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని సీతక్క అన్నారు.