గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్
NEWS Dec 04,2024 06:42 am
రాష్ట్ర ప్రభుత్వం దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర గవర్నర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయనను ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించింది.