ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ సిద్ధం!
NEWS Dec 04,2024 04:48 am
తెలంగాణలో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ సిద్ధం చేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.