అల్ప పీడనం జర భద్రం
NEWS Dec 04,2024 03:27 am
తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వాతావరణ శాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు .