మల్యాల మండలంలో స్వల్ప భూకంపం
NEWS Dec 04,2024 03:29 am
మల్యాల మండల కేంద్రంలో బుధవారం ఉదయం దాదాపు 7 నుండి 7-30 గంటల ప్రాంతంలో భూమి 4 నుండి 5 సెకన్లు ప్రకంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. కొంతమంది ఇండ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ఇప్పటివరకు ఇలాంటి భూ ప్రకంపనలు తాము చూడ లేదని జనం అంటున్నారు.