జగిత్యాల లో స్వల్ప భూకంపం
NEWS Dec 04,2024 03:31 am
జగిత్యాల లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్ రోడ్, కృష్ణానగర్, విద్యానగర్, ఇస్లాంపుర , ఉస్మాన్పురలో 3 సెకండ్ల పాటు స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై జనం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.