దొంగతనం కేసులో నిందితుడు అరెస్టు
NEWS Dec 03,2024 04:41 pm
మామిడికుదురు బండారు వారి వీధిలో చైన్ దొంగతనం కేసులో నిందితుడు హేమంత్ కుమార్ ను అరెస్టు చేశామని నగరం ఎస్ఐ చైతన్య కుమార్ మంగళవారం తెలిపారు. బాధితురాలు శేష కుమారి ఫిర్యాదు మేరకు గత నెల 29వ తేదీన కేసు నమోదు చేశామన్నారు. దగ్గర బంధువైన నిందితుడు పెనుమలూరు మండలం తాడిగడపకు చెందినవాడని చెప్పారు. మరొక స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడ్డాడన్నారు.