మానసిక విద్యార్థులకు బక్కెట్లు, దుప్పట్ల పంపిణీ
NEWS Dec 03,2024 04:35 pm
కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని మానసిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరిగింది. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ.. ఏటా డిసెంబర్ 3న ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని వికలాంగుల హక్కులు, వారి శ్రేయస్సు కోరి వారిని ప్రోత్సహించడానికి మానసికంగా బాధపడుతున్న విద్యార్థులకు వీలయినంత సహాయం చేయడానికి గ్రేస్ మినిస్ట్రీస్ సిద్ధంగా ఉందన్నారు.