స్వర్ణరథంపై శ్రీ పద్మావతి కటాక్షం
NEWS Dec 03,2024 01:20 pm
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మ వారు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. స్వర్ణ రథంపై అమ్మ వారు విశేష స్వర్ణ, వజ్ర ఆభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణ రథాన్ని లాగారు.