ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు
NEWS Dec 03,2024 01:14 pm
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సమగ్ర వించారణ జరపాలని కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేశారు. ఎంక్వైరి ఆఫీసర్ గా ఆర్డీవోను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. డిసెంబర్ 1న పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు.