కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
NEWS Dec 03,2024 01:12 pm
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మార్చురీ గదిలోనే భద్రపరిచారు. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కోర్టు ఆదేశాల మేరకు భద్రపరిచారు.