బీరు సీసాలో చెత్త దర్శనం
NEWS Dec 03,2024 01:16 pm
మల్లాపూర్ మండలం ఓబులాపూర్ బెల్టు షాపులో కొన్న బీరు సీసా లో చెత్త రావడంతో కొనుగోలుదారుడు ఖంగు తిన్నాడు. ఖానాపూర్ కు చెందిన వ్యక్తి ఓబులాపూర్ గ్రామంలోని బెల్టు షాపులో కొన్న బీరు లో చెత్త కనిపించడంతో ఆందోళన చెందాడు. ఇదేంటని నిర్వాహకుని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడాడాని ఆరోపించాడు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు .