మార్పునకు పట్టం నియంతకు మంగళం
NEWS Dec 03,2024 01:00 pm
పదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడిన రోజు డిసెంబర్ 3 అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంబండ వర్ణాల ప్రజలు ముక్త కంఠంతో నియంత కేసీఆర్ ను ఇంటికి సాగనింపారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసిన రోజు అన్నారు. గడీల పాలనకు పుల్ స్టాప్ పెట్టిన రోజు అని, మలి విడత తెలంగాణ మహోద్యమానికి శ్రీకాంతాచారి అమరత్వ ఆశయానికి అంకురార్పణ జరిగిన రోజు అన్నారు సీఎం.