వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వినతి
NEWS Dec 03,2024 04:29 pm
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్ గౌని నుండి శ్రీ కృష్ణ నగర్ కాలనీ సిద్దాపూర్ వెళ్లే ప్రజలు రాత్రి వేళలో చీకటిగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై అడ్డంగా విష కీటకాలు, పాములు, తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్థానిక వార్డు కౌన్సిలర్ గుండు రవి, మున్సిపల్ కమిషనరు వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన కమిషన్ వీధి దీపాలకు హామీ ఇచ్చారు