అప్పుల భారం అయినా పథకాలు ఆపం
NEWS Dec 03,2024 11:30 am
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తమ పాలిట గత సర్కార్ చేసిన అప్పులు భారంగా మారాయని వాపోయారు. రూ.7,00,000 కోట్లకు పైగా అప్పుల భారం మోపారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత వాటాదారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడమన్నారు రేవంత్ రెడ్డి.