శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
NEWS Dec 03,2024 04:32 pm
ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని అన్ని వర్గాల ప్రజలు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సీపీ కోరారు.