రామగిరిఖిల్లా అభివృద్దికి ముఖ్యమంత్రి చొరవచూపాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
NEWS Dec 03,2024 04:13 pm
రామగిరిఖిలా అభివృద్దికి సీఎం చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపధ్యంలో అదే సభలో రామగిరిఖిల్లా అభివృద్ది కొరకు ప్రకటన చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. స్వయాన శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా ఇక్కడ నడయాడిన ఆనవాళ్ళు ఉన్నాయని, రాములవారు స్వయంభుగా ఇక్కడ వెలిశారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.