గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
NEWS Dec 03,2024 04:15 pm
కామారెడ్డి: కేటీఆర్ పిలుపు మేరకు, ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర BRSV జనరల్ సెక్రెటరీ సబ్బాని హరీష్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 6వ వార్డులోని ట్రిబల్ వెల్ఫేర్ కాలేజీని మంగళవారం సందర్శించడానికి వెళ్లారు. వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమాజసమని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్తే అడ్డుకోవడం తగదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.