వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Dec 03,2024 04:19 pm
నిర్మల్ జిల్లా : పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష మంగళవారం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ జనవరి నుండి ఇప్పటివరకు కోడిగుడ్ల బిల్లు చెల్లించలేదని, వంట కార్మికులకు 2 వేల వేతనం జూన్ నెల నుండి ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంట కార్మికులకు పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.