పంచమి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు
NEWS Dec 03,2024 10:17 am
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు 6న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జెఈవో వీరబ్రహ్మం తెలిపారు.పుష్కరిణిలో గేట్లు, పంచమితీర్థ మండపాన్ని పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.