ముగిసిన కేబినెట్ 23 అంశాలకు ఓకే
NEWS Dec 03,2024 10:04 am
ఏపీ మంత్రివర్గ కీలక సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఆమోదం తెలిపింది.