డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదలకు అన్నదానం
NEWS Dec 03,2024 04:23 pm
డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదలకు కోసం క్యాంటీన్ ద్వారా అన్నదానం నిర్వహిస్తున్నామని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను నిర్వహించి 400 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. క్యాంటీన్ నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారని రమేష్ తెలిపారు.