యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనిల్
NEWS Dec 04,2024 07:35 am
మల్యాల మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముత్యంపేటకు చెందిన కొండబత్తిని అనిల్ కుమార్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తన కార్యాలయంలో అనిల్ కు అందజేశారు. అనిల్ తనను నియమించినందుకు గాను ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, ముత్యం శంకర్, నేరెళ్ల సతీష్, కొలకాని మారుతి తదితరులు పాల్గొన్నారు.