కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
NEWS Dec 03,2024 08:27 am
జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని కలియతిరిగి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఓపి రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు పలు సూచనలు చేశారు.