దివ్యాంగులకు సర్కార్ ఆసరా
NEWS Dec 03,2024 06:52 am
ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరాగా నిలుస్తోందని అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. త్రిచక్ర మోటారు వాహనాలు, ఆర్థిక ఆసరా అందజేసినట్లు తెలిపారు. పింఛన్ రూ. 6000కి పెంచినట్లు స్పష్టం చేశారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.