ప్రేమజంట ఆత్మహత్య
NEWS Dec 03,2024 08:41 am
విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సుష్మిత, దుర్గారావు కుటుంబాలు బ్రతుకుదెరువు కోసం షీలానగర్ లో నివాసం ఉంటున్నారు. సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకేశాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు.