అంజన్నను దర్శించుకున్న వరుణ్ తేజ్
NEWS Dec 03,2024 08:40 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం ప్రముఖ సినీ హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న చాలా మహిమగల దేవుడని, ఆయనను దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందని అన్నారు.