శ్రీకాంతాచారి ఆత్మార్పణం అభివందనం
NEWS Dec 03,2024 04:28 am
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి రోజు ఇవాళ. ఈ దేహం తెలంగాణకు అంకితం అంటూ ఆనాటి ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని నిరసిస్తూ తనను తాను ఆత్మార్పణం చేసుకున్న ధీరుడు శ్రీకాంతాచారి. 1986 ఆగస్టు 15న పుట్టిన శ్రీకాంతాచారి 2009 నవంబర్ 29న హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకున్నాడు. డిసెంబర్ 3న తుది శ్వాస విడిచాడు.