గజ వాహనంపై శ్రీ పద్మావతి కటాక్షం
NEWS Dec 03,2024 03:02 am
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.