కేసీఆర్ మొక్క కాదు వేగుచుక్క
NEWS Dec 02,2024 01:07 pm
ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేసీఆర్ మొక్క కాదని పీకేసేందుకు ఆయన ఓ వేగు చుక్క అని స్పష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కావాలని కేసులు నమోదు చేస్తున్నారని, తామూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.