రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దు
NEWS Dec 02,2024 02:30 pm
మెట్‌పల్లి: 2 లక్షల లోపు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని వేంపేట్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి చెప్పారు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉండి రెండు లక్షల మాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దని, స్థానిక ఏఈఓ లేదా వ్యవసాయ అధికారులని కలిసి వివరాలు సమర్పించాలని తెలిపారు.