రైతుల ఢిల్లీ ఛలో ఆందోళన
NEWS Dec 02,2024 11:36 am
రైతన్నలు మరోసారి కదం తొక్కారు. పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దేశ రాజధాని రైతులతో నిండి పోయింది. మరో వైపు వారిని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. వివిధ రైతు సంఘాలన్నీ ఒక్కటై ఢిల్లీ ఛలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.