శ్రీ పద్మావతికి గొడుగుల బహూకరణ
NEWS Dec 02,2024 09:41 am
శ్రీ పద్మావతి అమ్మ వారికి ఉత్సవాల సందర్బంగా తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజున ఈ ట్రస్టు తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ ఆర్ గోపాల్‌జి 5 గొడుగులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.