Logo
Download our app
తిరుచానూరులో ఘ‌నంగా శోభాయాత్ర
NEWS   Dec 02,2024 09:27 am
శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో వెంకయ్య చౌదరి కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం ప‌సుపు మండ‌పం వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.
⚠️ You are not allowed to copy content or view source