నాలుగు కిలోల వెండి ఆభరణాలు బహూకరణ
NEWS Dec 02,2024 09:30 am
ఆలమూరు మండలం పెదపళ్ల లో రామాలయానికి భక్తులు వెండి ఆభరణాలు, బంగారు నామం బహుకరించారు. రాముడు,సీత , లక్ష్మణ ఆంజనేయ స్వామి కిరీటాలు పాదుకలను, ఇతర వస్తువులను నాలుగు కిలోల వెండితో తయారు చేయించి స్వామి వారికి బహుకరించారు. మరో భక్తురాలు రామునికి బంగారంతో తయారు చేయించిన నామాలను అందించినట్లు ఆలయ నిర్వాహకులు నామాల రుద్రయ్య చౌదరి తెలిపారు.