గోవర్దన్ కు మున్నూరు కాపు సంఘం సన్మానం
NEWS Dec 02,2024 06:58 am
మెట్ పల్లి రాంనగర్ మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని క్లబ్ లో నిర్వహించిన సంఘ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావులను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. మున్నూరు కాపు అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని కూన గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్ల రాజేష్, బెజ్జంకీ నవీన్, కృష్ణ బాబు, వేణు, ఆగ సురేష్, సంజీవ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.