ఉచిత మెగా వైద్య శిభిరం
NEWS Dec 02,2024 06:56 am
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరంలో మెడికవర్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ శిబిరానికి హాజరైన పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఈ శిభిరంలో 120 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో టెస్ట్ మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా మెడికవర్ యాజమాన్యం ప్రజల వద్దకు వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తుందన్నారు.