ఏపీ హోం మంత్రి సర్ ప్రైజ్
NEWS Dec 02,2024 05:27 am
హోం మంత్రి వంగలపూడి అనిత సర్ ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఫేమస్ వైజాగ్ దమ్ టీ స్టాల్ ని విజిట్ చేశారు. ఇక్కడ చాయ్ బాగుంటుందంటూ తనతో చాలా మంది చెప్పారని అన్నారు. నిర్వాహకులను ఆప్యాయంగా పలకరించారు. కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే టీ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనుకోకుండా వచ్చిన అనితకు ధన్యవాదాలు తెలిపారు టీ యజమానులు.