Logo
Download our app
పాపికొండల విహారయాత్ర నిలిపివేత
NEWS   Dec 02,2024 05:07 am
తుఫాన్ ప్రభావం కారణంగా దేవిపట్నం పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. సోమవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో గోదావరిలో బోట్లు ప్రయాణించే సమయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందన్న కారణంతో నిలిపివేసినట్లు చెప్పారు. విషయం గమనించి రంపచోడవరం పర్యాటక ప్రాంతాలకు ఎవరూ రావొద్దన్నారు.
⚠️ You are not allowed to copy content or view source