హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
NEWS Dec 02,2024 05:05 am
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి దేవస్థానం మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్లలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు.