తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 02,2024 03:33 am
భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,064 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు వచ్చిందని టీటీడీ ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని , సర్వ దర్శనం కోసం వేచి వున్న భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.